నిజామాబాద్ : మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఎట్టకేలకు కొడుకు మాజీ మేయర్ సంజయ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ఠ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణక్‌రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు వారిద్దరికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు షబ్బీర్‌అలీలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిఎల్ వీల్ ఛైర్‌లో చాలా కాలం తర్వాత గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. మరోవైపు డిఎస్ కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఆదివారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది.
మొదట మాజీ మేయర్ సంజయ్ మాత్రమే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నారని ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోవడంలేదని డిఎస్ పేరుతో ఓ లేఖ మీడియాకు రిలీజ్ అయింది. కానీ గంట వ్యవధిలోనే డిఎస్ అనూహ్యంగా గాంధీభవన్‌కు తనయుడు సంజయ్‌తో కలిసి వచ్చి సందడి చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మీడియాకు స్పష్టతనిచ్చారు. తాను కాంగ్రెస్ మనిషినేనని హైకమాండ్ ఎపుడో క్లియరెన్సు ఇచ్చిందన్నారు.