Wednesday, January 22, 2025

ప్రముఖ నిర్మాత ఆర్.వి. గురుపాదం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు నెలకొంటున్నాయి. శుక్రవారం సినీ దిగ్గజం కె. విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగార్ మరణవార్తలు మరవకమందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఆర్.వి. గురుపాదం శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. బెంగళూరులోని నివాసంలో గుండెపోటుతో గురుపాదం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సంతాపం తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో 25పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు బగలమారి భర్తలు, పులి బొబ్బిలి సినిమాలకు గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News