Monday, December 23, 2024

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె విరమణ..

- Advertisement -
- Advertisement -

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె విరమణ
మంత్రి హరీశ్‌రావు హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు
ప్రకటించిన సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మెను విరమించారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇవ్వడంతో తక్షణం సమ్మె విరమిస్తున్నట్లు సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంత్రి హరీశ్ రావు గారి నుండి పూర్తి స్థాయి హామీ వచ్చిందని, తాము విధుల్లో కొనసాగుతామని అసోయేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సీనియర్ రెసిడెంట్లకు వారంలోగా స్టైఫండ్ చెల్లించేందుకు, అటెండెన్స్ ఆధారంగా మే 2021 స్టైఫండ్ చెల్లించేంపునకు, 12 నెలల కాల పరిమితి గల సర్టిఫికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినందుకు వారు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఉదయం మంత్రి నివాసంలో కలిసి సీనియర్ రెసిడెంట్స్ వారి సమస్యలు వివరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరగా మంత్రి హరీష్ రావు సానుకులంగా స్పందించి పరిష్కారం దిశగా కృషి చేశారు. తమ సమస్యలు పూర్తిగా విని తక్షణం పరిష్కరించడం పట్ల సీనియర్ రెసిడెంట్స్ సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసింది. మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Senior Recident Doctors Call off Strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News