Sunday, December 22, 2024

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టిడిపి సీనియర్ నేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలీ బిన్ ఇబ్రహీం మస్కతీ ఆదివారం హైదరాబాద్‌లోని సిడబ్ల్యుసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట ఆయన శ్రేయోభిలాషులు, టీపీసీసీ ముస్లిం నేతలు కూడా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో లాంఛనంగా పార్టీలో చేరారు.

మస్కతీ కుటుంబం చాలా కాలంగా స్థానిక రాజకీయాలతో ముడిపడి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలీ మస్కతీకి కాంగ్రెస్ నుంచి టికెట్ లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2015లో మరణించిన అలీ మస్కతీ తండ్రి ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ఎఐఎంఐఎం ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు పనిచేశారు. అలీ మస్వతి 2002లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరి శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News