Wednesday, January 22, 2025

జనసేనలో చేరిన టిడిపి సీనియర్ నేతలు

- Advertisement -
- Advertisement -

అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి మొదలయింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారయినట్టే. కాగా జనసేన మాత్రం రెండు పెండింగ్ సీట్లకు ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. కృష్ణ జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు దక్కింది. అయితే అక్కడ  అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన సర్వేలు చేయించినా, అంచనాకు రాలేకపోయింది.

టిడిపి సీనియర్ నేతలు మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. కాగా అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ఖాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనకే విజయావకాశాలు ఎక్కువని జనసేన కూడా అభిప్రాయపడుతున్నట్లు వార్త. ఇక పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటన రావలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News