Monday, March 10, 2025

వన్ క్లాస్- వన్ టీచర్ విధానం తీసుకురాబోతున్నాం: మంత్రి నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు రూ. 8 లక్షల విలువైన మెటీరియల్ మంత్రి నిమ్మల అందజేశారు. తదుపరి మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటించబోతున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. వన్ క్లాస్- వన్ టీచర్ విధానం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. దీంతో పాటు తమ పాలన మెచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News