Friday, November 22, 2024

మితిమీరిన ర్యాగింగ్.. కాలేజీ అమ్మాయికి బలవంతంగా ముద్దులు !

- Advertisement -
- Advertisement -

 

బ్రహ్మపుర నగరం (ఒడిశా) : దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా ఈ విష సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. ఒడిశా గంజాం జిల్లా బినాయక ఆచార్య కళాశాలలో ఒక విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్ అంటూ లైంగిక పరమైన వేధింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. డిగ్రీ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో ఫ్రెషర్ అయిన మరో విద్యార్థితో బలవంతంగా ముద్దులు పెట్టించారు. ఇందుకు ఆ విద్యార్థి అభ్యంతరం చెప్పగా సీనియర్లు కొట్టారు. బాధిత విద్యార్థిని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుండగా, పక్కనే ఉన్న సీనియర్ విద్యార్థి చేయి పట్టుకుని ఆపి కర్రతో బెదిరించాడు. ఇదంతా కొంతమంది సీనియర్ అమ్మాయిలు అక్కడే నిలబడి నవ్వుతూ చూశారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు.

ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, ప్లస్ టు చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులకు కంపల్సరీ టీసీ ఇచ్చి తొలగించింది. వీరిలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు విద్యార్థుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరుపర్చి బాలల సంరక్షణ కేంద్రానికి పంపారు. నిందితుల్లో ఒకడైన ఫైనల ఇయర్ విద్యార్థి అభిషేక్ నాయక్ … బిజూ జనతాదళ్ విద్యార్థి విభాగానికి చెందినవాడని తెలుస్తోంది. గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై బెయిలుపై విడుదలయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News