Thursday, January 23, 2025

అమెరికా మాజీ సైనికాధికారి రాబర్ట్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసి, అనంతరం లొంగిపోయిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ కనిపించకపోవడంపై అమెరికా మాజీ సైనిక అధికారి రాబర్ట్ అబ్రమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యెవ్జెనీ అయితే చనిపోయి ఉండాలి, లేదంటే జైలులో అయినా ఉండాలి అని ఆయన అన్నారు. తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత మెర్సెనరీ గ్రూప్ చీఫ్‌ను పుతిన్ కలిశారని రష్యా నుంచి ప్రకటన వచ్చిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మీడియాతో అమెరికా మాజీ జనరల్ రాబర్ట్ అబ్రమ్స్ మాట్లాడుతూ, పుతిన్, యెవ్జెనీ మధ్య జరిగిన సమావేశం కూడా ఎజెండా ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు. ‘నా వ్యక్తిగత అంచనా ఏమిటంటే, మనం ప్రిగోజిన్‌ని మళ్లీ బహిరంగంగా చూస్తామా అనే సందేహం ఉంది. ఆయనను అజ్ఞాతంలో ఉంచారా లేదా జైలుకు పంపారా లేదా మరే విధంగానైనా వ్యవహరించారోనని నేను అనుకుంటున్నాను. మనం ఆయనను మళ్లీ చూస్తామా అనేది మాత్రం నాకు అనుమానంగానే అనిపిస్తోంది’ అని అన్నారు. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని మీరు అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, జనరల్ అబ్రమ్స్ స్పందిస్తూ జైలులో ఉన్నారేమో, లేదంటే మరింకేదైనా జరిగి ఉండొచు’ అని సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News