Monday, January 20, 2025

డిజిపి అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు!

- Advertisement -
- Advertisement -

మహేశ్ భగవత్, సంజయ్ కుమార్‌లకు షోకాజ్ నోటీసులు జారీ!

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎలక్షన్ కమిషన్ (ఇసి) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమ యంలోనే డిజిపి అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని డిజిపి కలుసుకుని చర్చ జరపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పిటిఐ న్యూజ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతన్ను సమయంలో అనూహ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపిఎస్ అధికారులు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్‌తో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లిన డిజిపి పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రవి గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వీరు రేవంత్‌ను కలవడంపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పిటిఐ వర్గాలు వెల్లడించాయి. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News