Thursday, December 19, 2024

రేపు సంచలన నిర్ణయం తీసుకుంటా: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Sensational decision will be taken tomorrow: Jagga reddy

హైదరాబాద్: రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలని కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సంచలన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పానన్న ఆవేదనలో ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యవహారం వల్లే మాట తప్పానని చెప్పారు. పార్టీ ఛీప్ కు రాజకీయ వ్యూహం ఉండాలని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అందరి ఆలోచనతో ముందుకెళ్లాలని సూచించారు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆలోచన చేయాలన్నారు. గతంలో విభేదాలపై రేవంత్ వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News