Monday, January 27, 2025

ఆ గదిలో జరగలేదు..

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నమ్మశక్యం కాని విషయాలు వెలుగు చూశాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూమ్‌లో అత్యాచారం, హత్య జరిగినట్లుగా ఆధారాలు దొరకలేదని కేంద్ర ఫోరెన్సిక్ పరిశోధన శాల (సిఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనగులాట జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలూ లభించలేదని నివేదిక తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చునని సిఎఫ్‌ఎస్‌ఎల్ సందేహాలు వ్యక్తం చేసింది. సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలు,

దాడికి పాల్పడిన వ్యక్తికి మధ్య ఎటువంటి గొడవా లేదా దాడి జరిగినట్లుగా ఆధారాలు లభించలేదని నివేదిక తెలియజేసింది. గదిలోపల మరి ఎక్కడా ఆనవాళ్లు లేవని నివేదిక పేర్కొన్నది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సిబిఐకి సిఎఫ్‌ఎస్‌ఎల్ ఇటీవలే నివేదిక సమర్పించింది. కాగా, గత ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి, వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం విదితమే. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తరువాత సిబిఐ దర్యాప్తు బాధ్యత తీసుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News