Monday, December 23, 2024

సాయిప్రియ కేసులో కొత్త కోణం

- Advertisement -
- Advertisement -

Sensational things in Saipriya's murder case

మనతెలంగాణ/హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో జరిగిన యువతి సాయిప్రియ హత్యకేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖిల్లా గణపురం మండలం మానాజిపల్లెలో ప్రియుడు శ్రీశైలం యువతిని అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న కళాశాలకు అని చెప్పి మైలార్‌దేవ్‌పల్లిలోని ఇంటి నుంచి బయలుదేరి సాయిప్రియ వనపర్తి జిల్లాలోని శ్రీశైలం వద్దకు వెళ్లింది. అమ్మాయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు డోజులు దాటినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గతంలో పరిచయం ఉన్న శ్రీశైలంపై వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఈక్రమంలో పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులకు తెలియకుండా తన వద్దకు వచ్చిన సాయిప్రియను పెళ్లి చేసుకోవాలని శ్రీశైలం ఒత్తిడి చేశాడు. దానికి యువతి నిరాకరించడంతో అత్యాచారం చేసి మెడకు చున్నీ బిగించి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పూడ్చేందుకు బంధువు శివ సాయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సాయిప్రియ తనను ప్రేమించి మరో వ్యక్తితో వివాహానికి సిద్దమైందనే అక్కసుతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తనకు దక్కనది మరోకరికి దక్కకూడదన్న కోపంతో సాయిప్రియను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి పాతిపెట్టాడు. నిందితుడు శ్రీశైలంను అరెస్ట్ చేసిన మైలార్ దేవిపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

స్నాప్‌చాట్‌లో చాటింగ్ 

స్నాప్‌చాట్ ద్వారా సాయిప్రియను నిందితుడు శ్రీశైలం ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్నాప్‌చాట్ ద్వారా చాటింగ్ చేసి ఆమెను నిందితుడు వనపర్తికి రప్పించాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ మధుబన్‌కాలనీకి చెందిన మేకల వెంకటేశ్ కుమార్తె సాయిప్రియ(19)తో వనపర్తి జిల్లా ఖిలా ఘణపురం మండలం, మానాజీపేటకు చెందిన అంజన్న కుమారుడు శ్రీశైలం(23)కు మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారింది. ఆమె విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారించారు. ఆ తర్వాత శ్రీశైలం స్వగ్రామం వెళ్లిపోయాడు. ఈనెల 5న శ్రీశైలం సాయిప్రియకు ఫోన్ చేసి మాట్లాడుదామని తన ఊరికి రమ్మని చెప్పాడు. ఆమె అదేరోజు భూత్‌పూర్ వెళ్లింది. సాయిప్రియను తమ గ్రామం తీసుకెళ్లి మేనమామ కుమార్తె అని అందరికీ పరిచయం చేసిన అనంతరం మాట్లాడుకుందామని కెనాల్ సమీపంలో గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోమని శ్రీశైలం అడగడంతో సాయిప్రియ ఆమె నిరాకరించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని, ఈ విషయం చెప్పేందుకే ఇక్కడి వచ్చానని సాయిప్రియ తెలిపింది.

పైగా పాల వ్యాపారం చేసుకునే నిన్ను పెళ్లి చేసుకోవడం మా అమ్మ, నాన్న అంగీకరించరని తేల్చిచెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీశైలం సాయిప్రియ మెడలోని చున్నీతో ఆమెను ఉరేసి చంపి స్నేహితుడు శివ సహకారంతో కెనాల్ సమీపంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. శవాన్ని పూడ్చిపెట్టిన తరువాత సాయిప్రియ ఫోన్‌ను సమీపంలోగల బావిలో పడేశాడు. సాయిప్రియ కనిపించడం లేదని ఆమె తండ్రి మేకల వెంకటేశ్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు శ్రీశైలం అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాజేంద్రనగర్ డిఐ పవన్‌కుమార్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ వి.రాజశేఖర్‌రెడ్డి గురువారం మానాసిపేట్ వెళ్లి శ్రీశైలంను గణపురం స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News