Thursday, January 23, 2025

శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎసిబి విచారణలో ఐఎఎస్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. శివబాలకృష్ణతో తన భవనాలకు ఐఎఎస్ అనుమతులు జారీ చేయించుకున్నారు. నార్సింగిలోని వివాదాస్పద భూమికి శివబాలకృష్ణ అడ్డుగోలు అనుమతులు ఇచ్చాడు. ఐఎఎస్ అధికారి ఆదేశాలతోనే అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నార్సింగిలోని ఓ ప్రాజెక్టు అనుమతికి ఐఎఎస్ రూ.10 కోట్లు అడిగినట్లు వెల్లడైంది. అధికారి డిమాండ్ చేసిన రూ. 10 కోట్లును వ్యాపారి షేక్ సైదా చెల్లించాడు. గత డిసెంబర్ లో బాలకృష్ణ ద్వారా ఐఎఎస్ కు రూ, 1 కోటి ముడుపులు చేరాయి. బాలకృష్ణ తెలిపిన విషయాల ద్వారా ఎసిబి ఈ కేసును మరిత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News