Wednesday, January 22, 2025

వివేకా హత్య కేసు: ఉదయ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కీలక అంశాలను చేర్చింది. వివేక్ హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని సిబిఐ పేర్కొంది. ఆధారాలు చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారని తెలిపింది. వివేకా హత్య రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంట్లో నుంచి బయటికెళ్లాడని తెలిపింది. వివేకా హత్య స్థలంలో ఆధారలు ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ వెల్లడించింది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చేరిపివేశారు. విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదని సిబిఐ స్పష్టం చేసింది.

పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్ ను అరెస్ట్ చేశాం. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిబిఐ వెల్లడించింది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారని తెలిపింది. హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్ రెడ్డి ఉన్నారు. హత్య తెలియగానే ఆధారాలు చెరిపివేతకు అవినాష్ ఇంట్లో ఎదురు చేశారు. అవినాష్ కు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారని సిబిఐ చెప్పింది. అవినాష్ ఇంట్లో ఉదయ్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికెళ్లినట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామని సిబిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News