అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్ టార్గెట్
వెయ్యి కోట్లు దోచుకున్న నిందితులు
నిందితులు ఉన్నత విద్యావంతులు
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి
హైదరాబాద్: అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నకిలీ కాల్ సెంటర్లు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకవైపు అంతర్జాతీయ క్రెడిట్ కార్డు ఓల్డర్స్ , అలాగే బ్యాంకులను మోసం చేస్తున్నారు. సిస్టమ్‌లో మాల్‌వేర్ వైరస్ చొరబడిందని చెప్పి కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు. నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మరో రెండు ముఠాల కోసం గాలిస్తున్నారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల డేటాను డార్క్ వెబ్ సైట్ , గూగుల్ యాడ్స్ ద్వారా డేటాను ఈ ముఠా సేకరించినట్లు విచారణలో తేలింది. గూగుల్ యాడ్స్‌లో వైరస్ క్లియర్ చేస్తామని యాడ్స్ ఇచ్చి , నిజమేనేమో అని సంప్రదించిన వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటారు.
ముందుగా గో టు అసిస్ట్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. ఆ యాప్ లింక్ షేర్ చేసి కస్టమర్ ఓపెన్ చేయగానే వెంటన్ అందులో ఉన్న డేటా మొత్తం కూడా సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్ళుతుంది. దీంతో సిస్టమ్‌లో మాల్ వేర్ వైరస్ ఉందని వారికి వర్చువల్‌గా చూపించి నమ్మిస్తారు. దీంతో సిస్టమ్‌లో రిమూట్ యాక్సెస్ తీసుకుని ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లను హ్యాక్ చేసి డబ్బులు మొత్తం కాళీ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నెంబర్, సీవీవీ నెంబర్ , ఎక్స్ పైరీ డేట్ తీసుకొని కార్డులో నగదు మొత్తం పేమెంట్ గెట్ వేల ద్వారా విదేశీ అకౌంట్లకు బదిలీ చేసినట్లు తేలింది. నిందితుల్లో లాయర్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. నేరం చేయడమే కాకుండా అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను రివర్స్ బెదిరించినట్లు తెలిసింది. ఒక్క బ్యాంక్ ఖాతాదారుడి నుంచి తాము డబ్బులు తీసుకోలేదని బుకియించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలు ఎక్కువగా ఉత్తరాది ముఠాలు ఎక్కువగా చేస్తాయి. ఈ కేసులో ట్విస్ట్ నగరానికి చెందిన నలుగురు నిందితులు ముఠాలో భాగస్వాములుగా ఉన్నారు.
క్రెడిట్ కార్డు హోల్డర్ల ట్రాప్…
ఈ ముఠా కాల్ సెంటర్లు ద్వారా టెలీకాలర్ల ద్వారా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు హోల్డర్స్‌ను ట్రాప్ చేస్తున్నారు. రెండు కాల్ సెంటర్లు ద్వారా 80 మంది టెలికాలర్స్‌ను నియమించుకొని వారికి టార్గెట్లు ఇచ్చి మరి నట్టేట ముంచేలా పథకం ప్రకారం ఈ గ్యాంగ్ మోసం చేసినట్లు తేలింది. ఈ చీకటి దందా పై నిఘా వర్గాలు , బ్యాంకింగ్ రంగాలు గుర్తించకపోవడంతో నాలుగేళ్ల వ్యవధిలోనే వెయి కోట్ల వరకు మోసం చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ ముఠా పెట్టిన రెండు టోల్ ఫ్రీ నెంబర్లు , రెండు కాల్ సెంటర్ల ద్వారా 33 వేల మందిని మోసం చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో తేలింది. ఈ చీకటి దందా అంతా నవీన్ భూటాని కనుసన్నులో నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల దందా వెనుక దుబాయికి చెందిన మరో రెండు ముఠాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పేమెంట్ గేట్ వేల ద్వారా కాజేసిన సొమ్మును విదేశీ అకౌంట్లుకు జమ చేయడం, ఈ ముఠా వెనుక నాలుగు, ఐదు దేశాలకు చెందిన హవాలా ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2017లో ఆర్‌ఎన్‌టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నవీన్ భూటాని కంపెనీ ఏర్పాటు చేశాడు. ఢిల్లీకి చెందిన మొనుతో కలిసి న్యూఢిల్లీలోని జనక్‌పురి, గజియాబాద్‌లోని కౌశంబీ, పంజాబ్ మౌహలిలో మూడు కాల్ సెంటర్స్, మూడు టోల్‌ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.