Wednesday, January 8, 2025

నేడు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

అస్థిరమైన సెషన్ లో బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నేటి లాభాలన్నీ చివరికి తుడిచిపెట్టుకుపోయాయి. ఎఫ్ ఎంసిజి, పిఎస్ యు బ్యాంక్ స్టాక్ లు ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యాహ్నానికి ముందు కనిపించిన మూమెంటం తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్ 56.99 పాయింట్లు లేక 0.07 శాతం పతనమై 79648.92 వద్ద, నిఫ్టీ 20.50 పాయింట్లు లేక 0.08 శాతం పతనమై 24347.00 వద్ద ముగిసింది. ఇదిలావుండగా నేడు 1763 షేర్లు లాభపడగా, 1810 షేర్లు నష్టపోయాయి. ఇక 84 షేర్లలో మార్పేమి లేదు. వోలాటిలిటీ ఇండెక్స్ గా భావించే ఇండియా విక్స్ మూడు శాతం పెరిగి దాదాపు 16 వద్ద స్థిరపడింది.

హిండెన్ బర్గ్ తాజా ఆరోపణల కారణంగా అదానీ స్టాక్స్ అదానీ విల్మర్, అదానీ టోటల్ గ్యాస్ 4శాతం మేరకు పతనమయ్యాయి. ఇక అదానీ ఎంటర్ప్రైజెస్ అర శాతం దిగువన ముగిసింది. ఇదిలా ఉండగా నిఫ్టీ 50 లో ఓఎన్ జిసి, హిరోమోటార్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, దివీస్ ల్యాబ్ షేర్లు లాభపడగా,  అదానీపోర్ట్స్, ఎన్ టిపిసి, డాక్టర్ రెడ్డీ, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నష్టపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News