మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ స్ఫూర్తిని కొనసాగించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో మేడ్చల్ జిల్లా ఉద్దమర్రి గ్రామంలోని పశు వైద్య శాలలో షీప్స్ అండ్ గోట్స్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి శంకర్, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
ఫిలింనగర్‌లో..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిలింనగర్‌లో డాక్టర్ స్వర్ణదీపక్, డాక్టర్ హిమబాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున్న మొక్కలను పెంచడంతో కాలుష్యం తగ్గించే వీలుందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు సంతోష్ కుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.