Monday, December 23, 2024

త్వరలో సెన్సెక్స్ @ 100,000

- Advertisement -
- Advertisement -

ముంబై : సెన్సెక్స్ త్వరలో 100,000 పాయింట్ల మార్క్‌ను తాకవచ్చని జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీస్ క్రిస్టోఫర్ వు డ్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా కాలంగా బుల్ మార్కెట్ ఉందని, అన్నారు. ఆందోళనలు ఉన్నప్పటికీ భారత స్టాక్‌మార్కెట్ దూసుకుపోనుందని ఆయన అన్నారు. అయితే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై అందరి దృష్టి ఉందని, మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుం దా లేదా అనేది ఎంతో కీలకమని అన్నారు. మార్కెట్‌కు రెం డో ప్రమాదాన్ని సూచిస్తూ, మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడ్ అయినప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని అన్నారు.

2022 జూన్‌లో యాక్టివ్‌గా ఉన్న డీ మ్యాట్ ఖాతాల సంఖ్య 38 మిలియన్లుగా ఉంటే, 2023 ఏ ప్రిల్ నాటికి అది 31 మిలియన్లకు తగ్గిందని అన్నారు. అం టే ఈ మధ్య కాలంలో పరిమిత శ్రేణిలో ట్రేడింగ్ జరగడం, మార్కెట్‌లో ఒడిదుడుకుల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుముఖం పట్టడంతో పాటు మార్కెట్‌కు ప్రజలు దూరంగా ఉన్నారు. భారతీయ స్టాక్‌మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు యూటర్న్ తీసుకున్నాయని క్రిస్టోఫర్ వుడ్ అన్నారు. గతేడాది డిసెంబర్ నుండి 2023 ఫిబ్రవరి వరకు విదేశీ ఇ న్వెస్టర్లు దాదాపు 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెన క్కి తీసుకోగా, మార్చిలో వారు 7 బిలియన్ డాలర్ల మేరకు కొనుగోలు చేశారు. గత సంవత్సరం కూడా క్రిస్టోఫర్ వుడ్ 2026 చివరి నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లను తాకుతుందని అంచనా వేశారు.

మళ్లీ 62,500 దాటిన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. వారం చివరి రోజు శుక్రవారం మార్కెట్ బూమ్‌ను చవిచూసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్ల లా భంతో 62,501 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 18,499 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 షే ర్లలో 20 లాభపడగా, 10 షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా రిలయన్స్, సన్ ఫార్మా, హిందాల్కో, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌సిఎల్ టెక్, దివీస్ ల్యాబ్, విప్రో, యుపిఎల్, టెక్ మహీంద్రా సహా నిఫ్టీ-50లోని 43 స్టాక్‌లు పెరిగాయి.

మరోవైపు ఒఎన్‌జిసి, గ్రాసిమ్, బజాజ్-ఆటో, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్‌తో సహా 7 నిఫ్టీ స్టాక్‌లు క్షీణించాయి. రంగాల వా రీగా చూస్తే, మీడియా రంగం అత్యధికంగా 2.24 శాతం లాభపడింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, మెటల్, ఫార్మా, పిఎస్ యు బ్యాంక్, రియల్టీ రంగాలు 1 శాతం చొప్పున పెరిగా యి. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలలో కూడా లాభాలు కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News