Wednesday, January 22, 2025

సెన్సెక్స్ @ 75,000

- Advertisement -
- Advertisement -

తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 27,000 మార్క్‌ను దాటింది. ఆఖరికి 111 పాయింట్ల జంప్‌తో 22,753 పా యింట్ల వద్ద స్థిరపడింది. ఈద్ పండుగ సందర్భం గా గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంది. కానీ దానికి ఒక రోజు ముందే మార్కెట్ పెట్టుబడిదారులకు గ్రాండ్ ఈద్ ఇచ్చి ముగించింది. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా అత్యధిక చారిత్రక స్థాయిలో ముగిసింది.

రూ.402 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద
బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో రూ.399.92 లక్షల కోట్లుగా ఉండగా, బుధవారం రూ.402.16 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.2.24 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇ డేటా ప్రకారం, 3,933 షేర్లు ట్రేడ్ అవగా, 1,960 షేర్లు లాభాలతో, 1,867 షేర్లు నష్టాలతో ముగిశాయి. 107 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ట్రేడింగ్‌లో నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ తొలిసారిగా 49,000 దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి ఇండెక్స్ 256 పాయింట్లు పెరిగి 48,986 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవే కాకుండా ఐటి, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌లో ఐటిసి 2.49 శాతం, కోటక్ మహీంద్రా 2.40 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.11 శాతం, ఎస్‌బిఐ 1.94 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.36 శాతం, టెక్ మహీంద్రా 1.35 శాతం, రిలయన్స్ 1.08 శాతం చొప్పున పెరిగాయి. మారుతీ సుజుకీ 1.60 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.83 శాతం, లార్సెన్ 0.73 శాతం క్షీణతతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News