Wednesday, January 22, 2025

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ 2 శాతం మేరకు క్రాష్!

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు (నవంబర్ 4న)  దేశీయ స్టాక్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం మేరకు పతనం అయ్యాయి. మిడ్,స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు కూడా 2 శాతం మేరకు పతనమయ్యాయి. మార్కెట్ క్యాపిటల్ దాదాపు రూ. 9 లక్షల కోట్ల మేరకు ఆవిరయింది.

దేశీయ స్టాక్ మార్కెట్ ఇలా పతనం కావడానికి ఐదు కారణాలు కనబడుతున్నాయి. అవి: అమెరికా ఎన్నికల సందర్భంగా అప్రమత్తత, వాల్యూయేషన్ సౌకర్యంగా లేకపోవడం(పిఈ) , నవంబర్ 7న యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీ వెలువడనుండడం,  క్యూ2 ఫలితాలు బలహీనంగా ఉండడం, ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేయడం.

నెగటివ్ మూవ్ మెంట్ ను ఛేదించేందుకు భారతీయ స్టాక్ మార్కెట్  అనేక సార్లు ప్రయత్నించింది. కానీ ఫ్రెష్ ట్రిగ్గర్స్ లేకపోవడం వల్ల విఫలమైంది. నిఫ్టీ 50 అయితే రెసిస్టెన్స్ ను(24470-24540 రేంజ్) ఛేదించలేకపోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News