Thursday, January 23, 2025

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నెగటివ్‌గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి గరిష్ఠాల నేపథ్యంలో లాభాల స్వీకరణ, కీలక రంగాల్లో అమ్మకాల వెల్లువ, చైనాలో కరోనా కేసుల విజృంభణ వంటి పరిణామాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.

నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, టాటా మోటార్స్, హీరో మోటో కార్పొ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా లాభపడగా, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే ఇండియా, కొటక్ మహీంద్ర బ్యాంక్, టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. సెక్టార్ల పరంగా చూసినప్పుడు నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఐటీ, ఫార్మా సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి రంగాల్లో కాస్త అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ వాల్యూమ్స్ 100 శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 20.96 పాయింట్లు లేక 0.03 శాతం పెరిగి 62293.64 వద్ద స్థిరపడింది. కాగా నిఫ్టీ 28.65 పాయింట్లు లేక 0.15 శాతం పెరిగి 18512.75 వద్ద స్థిరపడింది. ఇక అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ పోల్చినప్పుడు 0.01 పైసలు లేక 0.01 శాతం పడిపోయి రూపాయి 81.69 వద్ద స్థిరపడింది. బంగారం ధర దాదాపు 139.00 రూపాయలు లేక 0.26 శాతం పడిపోయి 52532.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News