Thursday, January 23, 2025

ఒడిదుడుకుల మధ్య దిగువన ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

 

 

 

sensex

ముంబై: అత్యంత ఒడిదుడుకుల సెషన్‌లో భారత బెంచ్‌మార్క్ సూచీలు ఆగస్టు 4న స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.73 పాయింట్లు లేదా 0.09% క్షీణించి 58,298.80 వద్ద, నిఫ్టీ 6.20 పాయింట్లు లేదా 0.04% క్షీణించి 17,382 వద్ద ముగిశాయి. దాదాపు 1515 షేర్లు పురోగమించాయి, 1735 షేర్లు క్షీణించాయి మరియు 141 షేర్లు మారలేదు. మార్కెట్  గురించి స్థూలంగా చెప్పాలంటే ఫ్లాట్ గానే ముగిసిందనాలి. నిఫ్టీలో సిప్లా, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్ ప్రధాన లాభాల్లో ఉండగా,   ఎన్‌టిపిసి, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, ఎస్‌బిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. సెక్టార్లలో మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ 1-2 శాతం ఎగబాకగా, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మూమెంటం ఇండికేటర్ ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాస్ఓవర్‌లో ఉంది. ట్రెండ్ 17500 కంటే దిగువన ఉన్నంత వరకు ప్రతికూలంగా ఉంటుంది. దిగువ ముగింపులో మద్దతు 17100-17000 దగ్గిర ఉంది.

బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అటూఇటూ కదలికలతో భారత రిజర్వు బ్యాంకు పాలసీకి ఒక రోజు ముందు,  అధిక అస్థిరతను చవిచూసింది. బుల్స్ , బేర్స్  37,200  మద్దతు, 38,200  రెసిస్టెన్స్ స్థాయిల వద్ద  రెండు చివరల నుండి పోరాడటానికి ప్రయత్నించారు. ఇండెక్స్ ఇప్పటికే ఓవర్‌బాట్ జోన్‌లో ట్రేడ్ అవుతోంది,  ప్రస్తుత స్థాయి నుండి కరెక్షన్‌ను తోసిపుచ్చలేము.

డాలర్‌తో  గత ముగింపు 79.16తో పోలిస్తే,   భారత రూపాయి 31 పైసలు తగ్గి 79.47 వద్ద ముగిసింది.

Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News