Monday, December 23, 2024

రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు(శుక్రవారం) సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజునా నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువ కావడంతో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. వాహన, లోహ, ఐటి, ఎఫ్‌ఎంసిజి రంగాల స్టాకుల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేక 0.33 శాతం నష్టపోయి 62625.63 వద్ద, నిఫ్టీ 71.15 పాయింట్లు లేక 0.38 నష్టపోయి 18563.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా లాభపడిన షేర్లలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టి ఉండగా, హీరో మోటో కార్ప్, ఐషెర్ మెటార్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, డివీస్ ల్యాబ్స్ ప్రధానంగా నష్టపోయాయి. డాలరు మారకంతో రూపాయి విలువ 0.12 పైసలు పడిపోయి రూ. 82.46 వద్ద ట్రేడయింది. 10 గ్రాముల స్వచ్ఛ బంగారం రూ.14.00 తగ్గి రూ. 59877.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News