Wednesday, January 22, 2025

స్టాక్ మార్కెట్‌లో తొమ్మిది రోజుల బుల్ రన్ ర్యాలీకి బ్రేక్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ వారపు తొలి రోజునే(సోమవారం) స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. టెక్ స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు నిరాశ కలిగించాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కూడా నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నిరాశకనబరిచింది. తొమ్మిది రోజుల బుల్ రన్ ర్యాలీకి బ్రేక్ పడింది. నేడు సెన్సెక్స్ , నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సైకాలజీ మార్క్ 60000ను, నిఫ్టీ 17700 స్థాయిలను బ్రేక్ చేశాయి.

నిఫ్టీ 50 నేడు 145.95 పాయింట్లు లేక 0.82 శాతం పతనమై 17682.05 వద్ద ముగిసింది. ఈ సూచీ దినసరి కనిష్ఠం 17574.05 ను తాకి 254 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇక సెన్సెక్స్ 576.09 పాయింట్లు లేక 0.95 శాతం పతనమై 59854.91 వద్ద ముగిసింది. స్థూలంగా చెప్పాలంటే ఐటి స్టాకులు లాభాలను తుడిచేశాయి. ఒత్తిడిని పెంచాయి.
నిఫ్టీలో నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్‌బిఐ, కోల్ ఇండియా లిమిటెడ్ షేర్లు ప్రధానంగా లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, ఎన్‌టిపిసి ప్రధానంగా నష్టపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News