Sunday, December 22, 2024

సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం వరుసగా ఆరవ రోజున సరికొత్త జీవన గరిష్ఠాలను నమోదు చేశాయి. ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లలో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. స్టాక్ మార్కెట్ మంగళవారం ముగిసే సమయానికి సెన్సెక్స్ 177.04 పాయింట్లు లేక 0.28 శాతం పెరిగి 62681.84 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 55.30 పాయింట్లు లేక 0.30 శాతం పెరిగి 18618.05 వద్ద ముగిసింది.

మొదట మార్కెట్ ఫ్లాట్ గా ఆరంభమైనప్పటికీ తర్వాత పుంజుకుని సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. నిఫ్టీలో హెచ్‌యూఎల్, జెఎస్‌డబ్లు స్టీల్, హీరో మోటో కార్ప్, సిప్లా, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతి సుజుకీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నష్టపోయాయి. రంగాలవారీగా చూసినప్పుడు ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, మెటల్ సూచీలు 0. 51 శాతం పెరిగాయి. కాగా ఆటో, ఇన్‌ఫ్రా స్టాకుల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. లౌరస ల్యాబ్స్, ఇండియన్ హోటల్స్, ఎబిబి ఇండియా షేర్లలో షార్ట్ బిల్డప్, డబర్ ఇండియా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బంధన్ బ్యాంక్‌లలో లాంగ్ బిల్డప్ కనిపించింది. టెక్నికల్‌గా చూసినట్లయితే మార్కెట్ స్థిరంగా హైయర్ హై, హైయర్ లో చూయిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పాజిటివ్‌గా ఉంది. సపోర్ట్ లెవల్ ఇప్పుడు 18450 నుంచి 18550కి మారింది. 18550కి మీడ ట్రేడయ్యేట్లయితే 18750-18800కు చేరేట్లు కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News