Sunday, January 12, 2025

స్టాక్ మార్కెట్ లో  ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్

- Advertisement -
- Advertisement -

ఆర్ బిఐ పాలిసీ తర్వాత అత్యంత ఒడిదుడుకులకు లోనైన మార్కెట్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం అత్యంత ఒడిదుడుకులకు లోనై చివరికి స్వల్పంగా నష్టాల్లో ముగిసింది.  సెన్సెక్స్ 56.74 పాయింట్లు లేక 0.06 శాతం తగ్గి 81709.12 వద్ద, నిఫ్టీ 30.61 పాయింట్లు లేక 0.12 శాతం తగ్గి 247677.80 వద్ద ముగిసింది.  టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బిపిసిఎల్, డాక్టర్ రెడ్డి షేర్లు లాభపడగా, అదానీపోర్ట్స్, సిప్లా, భారతీఎయిర్టెల్, హెచ్ డిఎఫ్ సి లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. ఎస్ టిటి వంటి రకరకాల ఛార్జీలు, అత్యధిక బ్రోకరేజ్ ఛార్జీలు( ప్రతి ట్రేడ్ కు రూ. 10 చొప్పున) ఇంట్రాడే ట్రేడింగ్ లో విధిస్తుండడంతో మార్కెట్ లో మునుపటి జోష్ కనిపించడం లేదు. పైగా సూచీలు చాలా వరకు సైడ్ వేస్ లో ఉంటూ నష్టాన్ని ముట్టకట్టుకునేలా చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్ వంటివి అంతగా లాభానిచ్చేలా లేవు.

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 0.05 పైసలు తగ్గి రూ. 84.69వద్ద ట్రేడయింది. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 125.00 తగ్గి రూ. 76620.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News