Monday, December 23, 2024

బేరిష్ గ్లోబల్ ట్రెండ్స్ మధ్య సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పడిపోయాయి

- Advertisement -
- Advertisement -

sensex

ముంబై: ఈక్విటీ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున క్షీణించాయి, గ్లోబల్ మార్కెట్లలో మొత్తం బేరిష్ ట్రెండ్ మధ్య శుక్రవారం  మూడవ రోజున కూడా స్టాక్ మార్కెట్ క్షీణతను కొనసాగించింది. 30 షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ 1,020.80 పాయింట్లు లేదా 1.73 శాతం తగ్గి 58,098.92 వద్ద స్థిరపడింది. డే ట్రేడింగ్ లో  ఇది 1,137.77 పాయింట్లు లేదా 1.92 శాతం వరకు పడిపోయి 57,981.95 వద్దకు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 302.45 పాయింట్లు లేదా 1.72 శాతం క్షీణించి 17,327.35 వద్ద ముగిసింది.

30 షేర్ల సెన్సెక్స్ ప్యాక్‌లో పవర్ గ్రిడ్ 7.93 శాతం క్షీణించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, NTPC, HDFC , ఇండస్ఇండ్ బ్యాంక్ తదితరాలు ప్రధానంగా నష్టపోయాయి. కాగా సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటిసి మాత్రమే లాభపడ్డాయి.

ఆసియాలోని ఇతర చోట్ల… సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ సెషన్ డీల్స్‌లో యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే గురువారం అమెరికా మార్కెట్లు ప్రతికూలంగా ముగిశాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.87 శాతం క్షీణించి 88.77 డాలర్లకు చేరుకుంది.

బిఎస్‌ఈలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం నికరంగా రూ. 2,509.55 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News