Monday, December 23, 2024

ఆర్‌బిఐ రెపోరేట్ పాలసీతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 6.5 శాతం ఉండగలదని ఆర్‌బిఐ సూచించింది. ఇదిలావుండగా అమెరికాలో బుధవారం టెక్ స్టాకులు పడిపోయాయి. వాల్‌స్ట్రీట్‌లో స్టాకులు లాభాలను మించి నష్టాలు నమోదయ్యాయి.

ఇది రాసే సమయానికి సెన్సెక్స్ 112.28 పాయింట్లు లేక 0.18 శాతం నష్టపోయి 63030.68 వద్ద, నిఫ్టీ50 40.15 పాయింట్లు లేక 0.21 శాతం నష్టపోయి 18686.25 వద్ద, నిఫ్టీ బ్యాంకు సూచీ 45.55 లేక 0.10 శాతం నష్టపోయి 44229.75 వద్ద ట్రేడవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News