Wednesday, January 22, 2025

మార్కెట్లు జంప్

- Advertisement -
- Advertisement -
Sensex climbs 1736 points
రష్యా-ఉక్రెయిన్ శాంతి ఆశలతో పుంజుకున్న మార్కెట్లు

ముంబై : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కి తీసుకుందనే వార్తలతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో మార్కెట్లు జంప్ చేశాయి. సోమవారం ఎంత స్థాయి సూచీలు పతనం అయ్యాయో, అంతే స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు పెరిగాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 3 శాతం తగ్గాయి. ఈ పరిణామాలతో ఈక్వీట ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ మళ్లీ 17,350 పాయింట్ల మార్క్‌ను చేరుకుంది. ఆఖరికి 510 పాయింట్ల లాభంతో 17,352 పాయింట్లకు చేరుకుంది. ఇక సెన్సెక్స్ 1,736 పాయింట్ల లాభంతో 58,142 పాయింట్లకు చేరగా, ఈ సూచీ కూడా కీలక 58 వేల మార్క్‌ను దాటింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 2.7 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ 2 శాతం లాభపడింది. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్, ఆటో సూచీలు 4 శాతం లాభపడ్డాయి. ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి, రియాల్టీ సూచీలు కూడా 3.5 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ గెయినర్స్ టాటా మోటార్స్ 7 శాతం వరకు పెరిగింది. ఇంకా బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్, హీరో మోటోకార్ప్ కూడా మంచి లాభాలను నమోదు చేశాయి.

స్పైస్‌జెట్ లాభం రూ.42 కోట్లు

డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నికర లాభం రూ.42.45 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.66.78 కోట్ల నష్టం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.187 కోట్ల నుంచి రూ.268 కోట్లకు పెరిగింది. స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ మాట్లాడుతూ, మెరుగైన లాజిస్టిక్స్ ఆపరేషన్స్, ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల క్యూ3లో సంస్థ లాభం నమోదు చేయడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News