- Advertisement -
689 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం మంచి లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 215 పాయింట్లు పెరిగి 21,453 వద్ద ముగిసింది. సోనీతో విలీనం రద్దు తర్వాత జీ నష్టపోగా, బుధవారం ఈ కంపెనీ షేర్లు 6.28 శాతం లాభపడి రూ.165.75 వద్ద ముగిశాయి.
సోనీతో విలీనం రద్దు కారణంగా జనవరి 23న 30 శాతం పడిపోయింది. డాబర్ ఇండియాను నడుపుతున్న బర్మన్ కుటుంబానికి రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 5.27 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది. దీని తర్వాత రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 4.98 శాతం పెరిగి, ఆఖరికి రూ.227.85 స్థాయిలో ముగిశాయి.
- Advertisement -