Friday, November 15, 2024

వరుస నష్టాలకు బ్రేక్..267 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఈ వారం దేశీయ స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంతర్జాతీయ పరిణామాలు మెరుగ్గా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు పెరిగి 65,216 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 83 పాయింట్లు లాభంతో 19,393 పాయింట్ల స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 లాభపడగా, 7 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి.

రంగాల వారీగా చూస్తే, మెటల్, ఐటి, పిఎస్‌ఇ, రియాల్టీ, ఫార్మా, ఇంధన సూచీలు లాభాలతో ముగిశాయి. పిఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లిస్టింగ్ తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 5 శాతం నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌టిఎస్‌ఇ ఇండెక్స్‌లో కొనసాగుతోంది. ఆగస్టు 23న ఎస్‌ఎంసిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌కి జోడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News