Wednesday, January 22, 2025

80000 మార్కును దాటేసిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారతీయ బెంచ్ మార్క్ సెన్సెక్స్ నేడు తొలిసారి 80000 దాటింది. నిఫ్టీ కూడా 24300 పాయింట్లు దాటింది. అత్యధిక స్థాయిలో ఓపెన్ అయినప్పటికీ రెండు సూచీలు కూడా చివరికి స్వల్ప ఆదిక్యతతోనే ముగిసాయి. సెన్సెక్స్ 62.87 పాయింట్లు లేక 0.07 శాతం పెరిగి 80049.67 వద్ద ముగియగా, నిఫ్టీ 15.66 పాయింట్లు లేక 0.06 శాతం పెరిగి 243032.15 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాప్ గెయినర్లుగా మాజగాన్ డాక్, హోనస కన్జూమర్, ఆస్ట్రా జెన్కా, ఎన్ బిసిసి ఉండగా, టాప్ లూజర్లుగా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, ఆవాస్ ఫైనాన్సియర్స్, నువామ వెల్త్, పాలిసీ బజార్ ఉన్నాయి.  ఇక బంగారం ధర విషయానికి వస్తే 13.00 పాయింట్లు లేక 0.02 శాతం తగ్గి రూ. 72390.00 వద్ద ట్రేడయింది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ 0.03 పాయింట్లు  లేక 0.04 శాతం తగ్గి రూ. 83.50 వద్ద ట్రేడయింది.

సెన్సెక్స్ ఏడు నెలల కాలంలో 70000 మార్కు నుంచి 80000 మార్కుకు చేరుకుంది. ఇది 2025 డిసెంబర్ నాటికి 16 శాతం సిఎజిఆర్ తో లక్ష పాయింట్లకు చేరుకోనున్నది. సెన్సెక్స్ సిఎజిఆర్ 15.9 శాతం లెక్కన 1979లో 100 పాయింట్ల నుంచి 800 పాయింట్లకు పెరిగింది.ఆ లెక్కన వచ్చే ఏడాదికల్లా లక్ష మార్కును దాటొచ్చని అంచనా. గమనించాల్సిన అంశం ఏమిటంటే షార్ట్ టైమ్ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు.

SENSEX prediction

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News