Wednesday, January 22, 2025

సెన్సెక్స్ 1000 పాయింట్లు ఢమాల్!

- Advertisement -
- Advertisement -
ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల వొత్తిడి

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఒక శాతం కంటే ఎక్కువ వోలటైల్ కనబరిచింది. వారాంతంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడంతో నేడు ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనబడింది. ఫియర్ గేజ్ సూచీ విక్స్ అన్ని రంగాలలో 20 శాతం జంప్ చవిచూసింది.  సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తీయడంతో అమెరికా అధికారులు పతనాన్ని ఆపే ప్రణాళికలను ప్రకటించారు. భయాన్ని నివారించే ప్రయత్నం చేశారు. అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపదని భారతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్ కుమార్ దాని ప్రభావం భారతీయ బ్యాంకులపై ఏ మాత్రం ఉండబోదని అన్నారు. కానీ నేడు బ్యాంక్ స్టాక్స్ 2.1 శాతం పతనమయ్యాయి. కాగా ప్రభుత్వ బ్యాంకుల రంగం 2.3 శాతం పతనమైంది. ఆటో కంపెనీలు 2.2 శాతం మేరకు నష్టపోయాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. దాని షేరు 7.6 శాతం మేరకు పతనమైంది. ఇదిలావుండగా టెక్ మహీంద్రా 10 శాతం పెరిగింది. ఎందుకంటే ఇన్ఫోసిస్ చెందిన ప్రముఖుడు మోహిత్ జోషి దానికి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చారు. కాగా ఇప్పుడున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.పి.గుర్నాని డిసెంబర్‌లో రిటైర్ అవుతున్నారు.

నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 897.28 పాయింట్లు లేక 1.52 శాతం నష్టపోయి 58237.85 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 258.60 పాయింట్లు లేక 1.49 శాతం నష్టపోయి 17154.30 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో నేడు ప్రధానంగా టెక్ మహీంద్రా, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ లాభపడగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి 0.06 పైసలు లేక 0.07 శాతం పెరిగి రూ. 82.12 వద్ద ముగిసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 740.00 లేక 1.32 శాతం పెరిగి రూ. 56890.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News