ఫెడ్ రేట్ల పెంపు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు
భారీగా 1,020 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెం పు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు వెరసి దేశీ య స్టాక్‌మార్కెట్లు భారీ పతనం అవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడడం, ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. దీంతో వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. ట్రేడింగ్ ముగి సే సమయానికి సెన్సెక్స్ 1020 పాయింట్లు క్షీణించి 58,140 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే దాదాపు రూ.4.83 లక్షల కోట్లు కోల్పోయారు. దీంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.276.65 లక్షల కోట్లకు తగ్గింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రకటనతో విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లు పతనమయ్యా యి. బ్యాంక్ నిఫ్టీ 1,090 పాయింట్ల క్షీణతతో ముగిసింది. రంగాల వారీగా చూస్తే, ఐటి, ఆటో, ఎనర్జీ, మెటల్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి రం గాల్లో లాభాల స్వీకరణ ఎక్కువగా ఉంది.
రెపో రేటును పెంచే అవకాశం
ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఈ నెల 28-30 తేదీలలో జరగనుంది. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ 7 శాతానికి చేరడంతో ఆర్‌బిఐ రెపో రేటును పెంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెపో రేటును 35 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చని తెలుస్తోంది.