Monday, December 23, 2024

అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!

- Advertisement -
- Advertisement -

Sensex down

నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.

ముంబయి: 30 షేర్ల బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు లేదా 2.83% పడిపోయి 52,669.51 వద్దకు చేరుకుంది. ఇక  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంచ్ బెంచ్మార్క్  నిఫ్టీ 430.90 పాయింట్లు లేదా 2.65% తగ్గి 15,809.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ లో   హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. కాగా ఐటిసి, డాక్టర్ రెడ్డీస్ లాభపడ్డాయి.

షాంఘై మినహా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి, సియోల్, హాంకాంగ్ మరియు టోక్యో నష్టాల్లో స్థిరపడ్డాయి. యూరప్‌లోని ఈక్విటీ ఎక్స్ఛేంజీలు కూడా మధ్యాహ్నం సెషన్‌లో బాగా పడిపోయాయి.  బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ద్రవ్యోల్బణం భయం పెరగడంతో  అమెరికా మార్కెట్లు జూన్ 2020 నుండి బాగా అమ్మకాలను చూసాయి” అని హేమ్ సెక్యూరిటీస్ హెడ్ – పిఎంఎస్ మోహిత్ నిగమ్ అన్నారు. ఇదిలావుండగా అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.29% క్షీణించి 107.7 డాలర్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం నికర రూ. 1,254.64 కోట్ల విలువైన షేర్లను వదిలించుకున్నారు.

విప్రో, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్ర వంటి వాటితో ఐటి మరియు మెటల్ ఇండెక్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ లోని టాప్ లూజర్స్ షేర్లు దాదాపు 6.21 శాతం నష్టపోయాయి. ఐటిసి, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు గురువారం రూ. 1254.54 కోట్ల షేర్లను ఆఫ్ లోడ్ చేశారు.

“పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు, ఫెడరల్ రిజర్వ్ మరింత జోరందుకునే  అవకాశాలు వంటి సెంటిమెంట్లు బెంచ్‌మార్క్‌లను దెబ్బతీశాయి. నిరాశావాదానికి మరో ప్రధాన కారణం ఎఫ్‌ఐఐ  క్యాంప్ నుండి కనికరం లేకుండా విపరీత అమ్మకాలు జరగడం’’ అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్ష్ వాకిల్ మాట్లాడుతూ, “బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో వీక్లీ డెరివేటివ్ ఎక్స్‌పైరీ డేలో భారతీయ మార్కెట్లు 2.5% కంటే ఎక్కువ పడిపోయాయి.”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News