Monday, December 23, 2024

భారీ నష్టాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -
Sensex crashes 778 points
778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి 55,469 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 188 పాయింట్లు పడిపోయి 16,606 పాయింట్ల వద్ద స్థిరపడింది. మారుతీ సుజుకీ, రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐషర్ మోటార్స్, సన్‌ఫార్మా వంటి ప్రధాన స్టాక్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా డౌన్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News