Wednesday, January 22, 2025

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు స్టాక్ మార్కెట్ సూచీలు మొదలవ్వడమే ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్స్(బిపిఎస్) మేరకు రేట్ పెంచనుందన్న భావనతో ప్రపంచ మార్కెట్‌లో బలహీనత, అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 878.88 పాయింట్లు లేక 1.40 శాతం తగ్గి 61799.03 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 245.40 పాయింట్లు లేక 1.32 శాతం తగ్గి 18414.90 వద్ద ముగిసింది. నిఫ్టీ50లో బ్రిటానియా, హీరో మోటో కార్పొరేషన్, ఎస్‌బిఐ లైఫ్, ఎన్‌టిపిసి టాప్ గెయినర్స్ కాగా, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి టాప్ లూజర్స్‌గా నిలిచాయి. డాలరు మారకంతో రూపాయి విలువ 0.29 పైసలు లేక 0.35 శాతం పెరిగి 82.75 వద్ద ముగిసింది. బంగారం ధర 589.00 రూపాయలు పతనమై రూ. 54097.00 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News