- Advertisement -
ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. ట్రేడింగ్ లో దూకుడు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలత లేకపోయినప్పటికీ దేశీయ మార్కెట్లు దూకుడును కనబరిచాయి.
నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 626.91 పాయింట్లు లేక 0.77 శాతం పెరిగి 81343.46 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 187.85 పాయింట్లు లేక 0.76 శాతం పెరిగి 24800.85 వద్ద ముగిసింది. నిఫ్టీలో జస్ట్ డయల్, టాటా టెలీసర్వీసెస్, ఇండియా సిమెంట్స్, ఐడిబిఐ బ్యాంక్ ప్రధానంగా లాభపడగా, జీ ఎంటర్ప్రైజస్, ట్రెంట్, యుటిఐ ఎఎంసి, హెచ్ఏఎల్ ప్రధానంగా నష్టపోయాయి.
- Advertisement -