Thursday, January 23, 2025

సెన్సెక్స్ @ 74,000

- Advertisement -
- Advertisement -

జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్‌లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను అధిగమించడంలో విజయవంతమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 22,490 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 74,086 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 22,474 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రారంభంలో మార్కెట్‌లో క్షీణత కనిపించగా తర్వాత కోలుకుంది. దిగువ స్థాయి నుండి సెన్సెక్స్‌లో 800 పాయింట్లు, నిఫ్టీ 270 పాయింట్లకు పైగా రికవరీ జరిగింది.

కానీ బుధవారం సెషన్‌లో మార్కెట్ మార్కెట్ విలువ తగ్గింది. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ.393.04 లక్షల కోట్లుగా ఉండగా, ఇది రూ.391.37 లక్షల కోట్లకు క్షీణించింది. అంటే మార్కెట్ వాల్యుయేషన్‌లో రూ.1.67 లక్షల కోట్ల నష్టం వచ్చింది. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ దిగువ స్థాయిల నుండి కోలుకుంది. బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్ల లాభంతో ముగిసింది. మరోవైపు ఆటో, ఐటి, ఫార్మా, పిఎస్‌యు బ్యాంకులు, ఎఫ్‌ఎన్‌సిజి, హెల్త్‌కేర్ రంగాల షేర్లు భారీగా లాభపడ్డాయి.

అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, మీడియా, రియల్ ఎస్టేట్, మెటల్స్ రంగాల షేర్లు పతనమయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీ క్షీణత కనిపించింది. ఓ దశలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1000 పాయింట్లు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయాయి. కానీ కొనుగోళ్లతో మళ్లీ కోలుకున్నాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 లాభాలతో, 11 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 32 షేర్లు పెరుగుదలతో, 18 షేర్లు పతనంతో ముగిశాయి. బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News