Sunday, January 19, 2025

వరుస లాభాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

241 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్ల వరుస లాభాలకు సోమవారం బ్రేక్‌పడింది. రోజంతా రెడ్ జోన్‌లో ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలోని 12 సెక్టార్లలో 8 రంగాల్లో నష్టాలు కనిపించాయి. పిఎస్‌యు, ప్రైవేట్ బ్యాంకుల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. పవర్ స్టాక్‌లలో రికార్డ్ లాభాలు కనిపిస్తున్నాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో మరింత క్షీణత ఉంది. కాగా బ్యాంక్ నిఫ్టీ 46,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241.79 పాయింట్లు (0.36 శాతం) నష్టంతో 67,596.84 స్థాయి వద్ద ముగిసింది.

నిఫ్టీ 59.05 పాయింట్లు (0.29 శాతం) క్షీణతతో 20,133.30 స్థాయి వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 0.54 శాతం పతనంతో 45980 స్థాయి వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 16 షేర్లు లాభపడగా, 14 షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స్‌లో పవర్ గ్రిడ్ 3.01 శాతం, టైటాన్ 2.73 శాతం, ఎం అండ్ ఎం 2.65 శాతం, ఎన్‌టిపిసి 2.07 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.35 శాతం లాభాలతో ముగిశాయి. టాప్ లూజర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.98 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.71 శాతం, ఇన్ఫోసిస్ 1.40 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.36 శాతం, టాటా స్టీల్ 1.21 శాతం పతనంతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News