Wednesday, January 22, 2025

అమ్మకాల ఒత్తిడితో నష్టాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం మొత్తంగా చూస్తే స్వల్పంగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ అమ్మకాల కారణంగా మార్కెట్లు పతనమవుతున్నాయి. గత వారం సెన్సెక్స్ 214 పాయింట్లు (0.32 శాతం) పతనమైంది. ఆఖరికి 65,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16 పాయింట్లు పతనమైంది. వారాంతానికి నిఫ్టీ 19,638 పాయింట్ల వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. అయితే వారాంతం శుక్రవారం మెటల్, ఫైనాన్షియల్, ఎనర్జీ స్టాక్స్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఈ కారణంగా మార్కెట్లు లాభపడ్డాయి. శుక్రవారం సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 65,828 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 19,638 వద్ద స్థిరపడింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 20 లాభపడగా, 10 క్షీణించాయి. ఐటి మినహా, ఆటో, బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, మెటల్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్‌తో సహా అన్ని రంగాల సూచీలు బుల్లిష్‌గా ఉన్నాయి.

ప్లాజా వైర్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపిఒ) శుక్రవారం ప్రారంభమైంది. రిటైల్ పెట్టుబడిదారులు ఈ ఐపిఒ కోసం సెప్టెంబర్ 29 నుండి నుండి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 13న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి. గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర నిరాశ కల్గించాయి. ఎఫ్‌ఎంసిజి, ఐటి, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. మిడ్‌క్యాప్ స్టాక్‌లలో అమ్మకాలు కనిపించాయి. మార్కెట్ ముగిసిన తర్వాత సెన్సెక్స్ 610 పాయింట్లు పడిపోయి 65,508 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 193 పాయింట్ల పతనంతో 19,523 పాయింట్ల వద్ద స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News