Sunday, December 22, 2024

ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ‘ఊహించినదాని కన్నా’ ఆర్థిక డేటాపై మూడీస్ 2024 భారత జిడిపి వృద్ధిని సూచించగా, ఇంధన, బ్యాంకింగ్ షేర్ల కొనుగోలు ఫలితంగా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగవ రోజు వృద్ధిని కొనసాగిస్తూ 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్66.14 పాయింట్ల మేర లేదా 0.09 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 73872.29 వద్ద ముగిసింది. సోమవారం ఒక దశలో సెన్సెక్స్ 183.98 పాయింట్ల మేర లేదా 0.24 శాతం మేర వృద్ధి చెంది 73990.13 పాయింట్లను చేరింది. విస్తృత సూచి నిఫ్టీ 27.20 పాయింట్ల మేర లేదా 0.12 శాతం మేర పెరిగి రికార్డు స్థాయిలో 22405.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కూడా ఒక దశలో ఇంట్రా డేలో 2240.90 పాయింట్లను తాకింది. నాలుగు రోజుల రికార్డు సృష్టి పరంపరలో సెన్సెక్స్ 1567 పాయింట్ల మేర లేదా 2.15 శాతం వృద్ధి చెందగా నిఫ్టీ 454 పాయింట్ల మేర లేదా సుమారు 2 శాతం మేర పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో ఎన్‌టిపిసి తక్కిన వాటి కన్నా 3.5 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. పవర్ గ్రిడ్ 2.63 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.03 శాతం, ఏక్సిస్ బ్యాంక్ 0.90 శాతం మేర పెరిగాయి. మరొక వైపు జెఎస్‌డబ్లు స్టీల్ 2.49 శాతం మేర పతనమైంది. నష్టాలు చూసిన సంస్థల్లో మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా స్టీల్, అల్ట్రాటె సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్ ఉన్నాయి. ఐటి టెక్ సూచీలు సోమవారం కూడా నష్టాలు మూటకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News