ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆఖరి సమయంలో మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో అప్పటి దాకా మంచి లాభాల్లో ఉన్న మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే అదానీ గ్రూప్ షేర్లలో మాత్రమం భారీ పెరుగుదల కనిపించగా, మిడ్-క్యాప్స్‌లోనూ ఉత్సాహం కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 61,981 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 18,348 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు బూమ్‌తో ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 13 లాభాలతో, 17 నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం నాటికి రూ.278.88 లక్షల కోట్లు ఉండగా, ఇది రూ.279.78 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మంగళవారం ట్రేడ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.90,000 కోట్లు పెరిగింది.