Wednesday, November 13, 2024

రెండో రోజూ లాభాలు

- Advertisement -
- Advertisement -
Sensex Ends 777 Points Higher
777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్‌పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 776.50 పాయింట్లు అంటే 1.35 శాతం పెరిగి 58,461 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, అలాఐగే యురోపియన్ దేశాల్లో మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ భారత్‌లో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఐటి, మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసిజి స్టాక్స్, నిఫ్టీ ఐటి, ఐటి సబ్ ఇండెక్స్ 2 శాతం వరకు పెరిగాయి. అదానీ పోర్ట్, హెచ్‌డిఎఫ్‌సి, పవర్‌గ్రిడ్ కార్ప్, టాటా స్టీల్, సన్‌ఫార్మా నిఫ్టీ గెయినర్స్‌లో ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఐటి, మెటల్, రియాల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్‌లు 2 శాతం వరకు పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. స్టార్ హెల్త్ ఐపిఒ ఆఖరి రోజు 69 శాతం మాత్రమే సబ్‌స్ర్కైబ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News