Sunday, January 19, 2025

కొనుగోళ్ల జోరుతో లాభాల్లోకి..

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత గురువారం ఎఫ్‌ఎంసిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాలతో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్లు పెరిగి 61,872 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 18,321 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసిజి స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి 0.61 శాతం లాభంతో ముగిసింది.

ఇది కాకుండా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి, ఆటో, ఫార్మా, బ్యాంకింగ్, మెటల్స్, ఇన్‌ఫ్రా రంగ షేర్లు లాభాలతో ముగిశాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, కమోడిటీ, ఎనర్జీ రంగాల షేర్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 28 లాభాలతో, 22 నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ బుధవారం రూ.279.55 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.280.46 కోట్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News