Monday, December 23, 2024

61981.79 వద్ద ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -
18300పైన ముగిసిన నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజున కూడా లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ స్టాకుల్లో ర్యాలీ కనిపించింది. బిఎస్‌ఈ సెన్సెక్స్ 18.11 పాయింట్లు లేక 0.03 శాతం పెరిగి ఫ్లాట్‌గా 61981.79 వద్ద, నిప్టీ50 కేవలం 33.60 శాతం లేక 0.18 పాయింట్లు పెరిగి 18314.40 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సెషన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 13 శాతం పెరిగింది. నిఫ్టీ మెటల్, మీడియా 2.59 శాతం, 1.12 శాతం పెరిగాయి. ఐటి 0.46 శాతం డౌన్ అయింది. నిఫ్టీ 50లో ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివీస్ లాబొరేటరీస్, ఐషెర్ మోటార్స్, యుపిఎల్, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్ర బ్యాంక్, గ్రాసిమ్ నష్టపోయాయి. ఇక బిఎస్‌ఈలో బజాజ్ ఫిన్‌సర్వ్, టాటామోటార్స్, ఏసియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్ కాగా, రిలయన్స్, టిసిఎస్, టైటాన్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. స్వచ్ఛమైన బంగారం(24 క్యారట్లది) 10 గ్రాములు ధర రూ. 383.00 లేక 0.64 శాతం తగ్గి రూ. 59838.00 వద్ద ట్రేడయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం 0.03 లేక 0.04 శాతం తగ్గి రూ. 82.80 వద్ద ట్రేడయింది.

ఎక్స్‌ఛేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం కొనుగోలుదారులుగా నిలిచారు. వారు రూ. 922.89 కోట్లు, రూ. 604.57 కోట్ల ఈక్విటీలు కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News