Thursday, October 24, 2024

నేడూ నష్టాల్లో స్టాక్ మార్కెట్ !

- Advertisement -
- Advertisement -

సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో వరుస నష్టాలలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 16.82 పాయింట్లు లేక 0.02 శాతం పతనమై 80065.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.10 పాయింట్లు లేక 0.15 శాతం పతనమై 24399.40 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా అల్ట్రాసిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, గ్రాసిమ్ షేర్లు లాభపడగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్ బిఐ లైఫ్, హిందాల్కో, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో ప్రధానంగా నష్టపోయాయి. నిఫ్టీలో 26 స్టాకులు లాభపడగా, 24 స్టాకులు నష్టపోయాయి, మార్పులేని(unchanged) షేర్లు లేవు.

ఇక 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 570.00 పెరిగి 748382.00 వద్ద ట్రేడయింది. కాగా అమెరికా డాలరు మారకం 0.02 శాతం తగ్గి రూ. 84.07 వద్ద ట్రేడయింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News