Saturday, November 23, 2024

సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం

- Advertisement -
- Advertisement -
sensex
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం

ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో… శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్‌ఇ సెన్సెక్స్ 111.01 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 52,907.93 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 924.69 పాయింట్లు లేదా 1.74 శాతం తగ్గి 52,094.25 వద్దకు చేరుకుంది.ఇక నిఫ్టీ 28.20 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 15,752.05 వద్ద ముగిసింది.

పవర్‌గ్రిడ్, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ,ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు క్షీణించాయి. కాగా ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సీలు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) గురువారం నాడు రూ. 1,138.05 కోట్ల విలువైన షేర్లను విక్రయించినందున, క్యాపిటల్ మార్కెట్‌లో నికర విక్రయదారులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం శుక్రవారం పెట్రోల్, డీజిల్ మరియు జెట్ ఇంధనం (ATF) పై ఎగుమతి పన్నును విధించింది. అదే సమయంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై ‘విండ్‌ఫాల్ పన్ను’ విధించడంలో యూకె వంటి దేశాలకు కలిసి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News