Monday, December 23, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. మదుపరులు అమెరికా ద్రవ్యోల్బణం డేటా, 12న జరుగనున్న ఫెడరల్ రిజర్వ్  పాలిసీ మీటింగ్ కోసం వేచిచూస్తున్నారు. అంతేకాక మోడీ మంత్రివర్గం, వారా పోర్ట్ ఫోలియోల కోసం ఎదురుచూస్తున్నారు.

బిఎస్ఈ సెన్సెక్స్ 0.27 శాతం లేక 203.28 పాయింట్లు పతనమై 76490.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 దాదాపు 0.13 శాతం లేక 30.95 పాయింట్లు పతనమై 23259.20 వద్ద ముగిసింది. నేడు బెంచ్ మార్క్ సూచీలు నారో రేంజ్ లో కదలాడాయి.

నిఫ్టీ50లో టాప్ గెయినర్లుగా అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిరో మోటో కార్ప్, సిప్లా షేర్లు నిలువగా, టాప్ లూజర్లుగా టెక్ మహీంద్రా, ఇన్పోసిస్, విప్రో, ఎం అండ్ ఎం షేర్లు నిలిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News