Thursday, January 9, 2025

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్లనుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో మొదలైనా చివరికి నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసిసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,రియల్టీ సెక్టార్లలో అమ్మకాలతో సూచీలు అస్థిరతకు గురయ్యాయి.దీంతో మొదటి సెషన్‌లో వచ్చిన లాభాలు ఆ తర్వాత ఆవిరయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 71,776.57 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగించిన సూచీలు చివరికి నష్టంతో ముగిశాయి.

సెన్సెక్స్ 260 పాయింట్ల నష్టంతో 71,425 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 21,586 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో హెచ్‌యుఎల్, ఎంఅండ్ ఎం, టిసిఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ హెచ్‌సిఎల్ టెక్నాలజీ టాప్ లూజర్లుగా నిలవగా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. కాగా సోమవారం అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు స్టాక్ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News